కమల్ హాసన్ నటించిన “భారతీయుడు 2″ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వం వహించిన, ఈ రాబోయే తమిళ చిత్రం 1996 విజిలెంట్ యాక్షన్ థ్రిల్లర్ “భారతీయుడు” కి కొనసాగింపు. శనివారం సాయంత్రం లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక X పేజీలో విడుదలకు సంబందించిన అప్డేట్ పంచుకుంది.
“సేనాపతి పునరాగమనానికి సిద్ధంగా ఉండండి! ఈ జూన్‌లో భారతీయుడు -2 సినిమా థియేటర్లలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. అని ప్రకటించారు.
కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జె సూర్య, వివేక్, బాబీ సింహా, నేదురుమూడి వేణు, పి సముద్రఖని, ప్రియా భవానీ శంకర్, మనోబాలా, గుల్షన్ గ్రోవర్, పియూష్ మిశ్రా, బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించనున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రవి వర్మన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
“భారతీయుడు 2″కి లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ అల్లిరాజా మరియు తమిళనాడు ప్రభుత్వం యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి మంత్రి, రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఉదయనిధి స్టాలిన్ మద్దతు ఇచ్చారు.